
హైదరాబాద్, వెలుగు: ప్రసాద్ ఐమ్యాక్స్ యజమానిపై కేసు నమోదయింది. సినిమా టికెట్లపై అదనంగా జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. సినిమా టికెట్లపై గతంలో 28 శాతం జీఎస్టీ ఉండేది. సినీ పరిశ్రమ ప్రముఖులు, నిర్మాతల నుంచి వచ్చిన విజ్ఞాపనలతో జీఎస్టీ కౌన్సిల్ 18 శాతానికి తగ్గించింది. వంద రూపాయల్లోపు టికెట్లపై 18 శాతం, రూ.100 పైన టికెట్లపై గరిష్టంగా 12 శాతం జీఎస్టీ విధించాలి. పన్ను తగ్గించినప్పటికీ ఐమాక్స్ లో పాత పద్ధతిలోనే 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న అధికారులు నిర్ధారణ చేసుకుని యాజమాన్యంపై కేసు పెట్టారు.