
ఏపీ టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై కేసు నమోదైంది. బాపులపాడు తహసీల్దార్ వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు తనకంటే ముందు ఉన్న తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో పేదలకు ఇళ్లను కేటాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెరికీడు, కొయ్యూరుతో సహా పలు గ్రామాల్లో పేదలకు నకిలీ పట్టాలను పంపిణీ చేశారని ఆరోపించారు. అయితే తహసీల్దార్ ఫిర్యాదుతో వంశీపై, ఆయన అనుచరుడు రంగాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.