ఆదిలాబాద్ జిల్లాలో పరువు తీస్తామని బెదిరించి రూ.1.50 లక్షలు డిమాండ్

ఆదిలాబాద్ జిల్లాలో పరువు తీస్తామని బెదిరించి రూ.1.50 లక్షలు డిమాండ్
  •     రూ.50 వేలు వసూలు.. ఇద్దరిపై కేసు

​నేరడిగొండ (ఇచ్చోడ), వెలుగు: పరువు తీస్తామని బెదిరించి ఓ వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి, రూ.50 వేలు వసూలు చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఎస్ హెచ్ వో నరేశ్​ కుమార్ వివరాల ప్రకారం..  మండలంలోని సిరిచెల్మకు చెందిన రాజారపు సందీప్ కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఉంది. 

వారి సంబంధం గురించి గ్రామంలో పంచాయతీ పెట్టి బయటపెడతామని, సమస్యను ఇక్కడితోనే పరిష్కరించాలంటే రూ.1.50 లక్షలు ఇవ్వాలని సందీప్​ను డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. భయాందోళనకు గురైన సందీప్ తన సోదరుడి ద్వారా వారికి రూ.50 వేలు అందజేశాడు. అయినా వారి వేధింపులు ఆగకపోవడంతో అజీం, రవీందర్‌‌ పై పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.