హీరో ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు.. ఇతను చేసిన వ్యాఖ్యలేంటీ..?

హీరో ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు.. ఇతను చేసిన వ్యాఖ్యలేంటీ..?

ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రపై అట్రాసిటీ కేసు నమోదైంది.  తన రాజకీయ పార్టీ ప్రజాకీయా వార్షికోత్సవంలో భాగంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో నిర్వహించారు. అందులో భాగంగా  విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ ఆయన సామెతలు చెప్పారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో బెంగళూరులో ఆయనపై  కేసు నమోదు అయింది.. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సౌత్‌ బెంగళూరు డీసీపీ కృష్ణకాంత్‌ తెలిపారు.  దీనిపై స్పందించిన హీరో ఉపేంద్ర క్షమాపణలు చెప్పారు. లైవ్‌ వీడియోను సైతం తన సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. 


"ఫేస్‌బుక్ ,  ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో టంగ్ ఆఫ్ స్లిప్ అయి కొన్ని కామెంట్స్ చేశాను. దీనివలన  కొంతమంది ఇబ్బందిపడ్డారని గ్రహించిన వెంటనే లైవ్‌ వీడియోను తొలగించాను. ఆ విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నన్ను క్షమించండి " అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు ఉపేంద్ర. కాగా ఉపేంద్ర వ్యాఖ్యలు తమని ఆవేదనకు గురి చేశాయంటూ ఆదివారం బెంగళూరులోని చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. సెక్షన్ 3(1)(ఆర్)(లు) కింద కేసు నమోదు చేయబడింది. 

హీరో ఉపేంద్రకు ఓ రాజకీయ పార్టీ ఉంది.. ప్రజాకియా పార్టీ ఆరో వార్షికోత్సవం సందర్భగా ఆగస్ట్ 12వ తేదీన.. సోషల్ మీడియా లైవ్ నిర్వహించారు. నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఊరు ఉంటే దళితులు ఇల్లు ఉంటాయనే ఓ సామెతను కోట్ చేస్తూ.. నెగెటివ్ గా మాట్లాడారు. దళితులను చిన్నచూపుగా ఆయన మాట్లాడటంతో కర్ణాటకలో దళితులు రోడ్డెక్కారు. హీరో ఉపేంద్ర దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వివాదం పెద్దది అవుతుండటంతో.. సోషల్ మీడియా లైవ్ లో వచ్చిన వ్యాఖ్యలను.. తన ఫ్లాట్ ఫాం నుంచి తొలగించారు. ఆ తర్వాత దళితులకు క్షమాపణలు కూడా చెప్పారు.