V6 News

ఆదిలాబాద్జిల్లాలో ఎన్నికల నిబంధనలు ఉల్లగించిన సర్పంచ్ అభ్యర్థిపై కేసు

ఆదిలాబాద్జిల్లాలో  ఎన్నికల నిబంధనలు ఉల్లగించిన  సర్పంచ్ అభ్యర్థిపై కేసు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆదిలాబాద్​జిల్లా నార్నూర్​ మండలం తడిహత్నూర్​ గ్రామ సర్పంచ్​అభ్యర్థి ఆర్.​మధుకర్​పై కేసు నమోదు చేసినట్లు సీఐ అంజమ్మ తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు మంగళవారం నాటికే అక్కడ ప్రచారం ముగియగా.. నిబంధనలకు విరుద్ధంగా బుధవారం తన ఇంటి ఆవరణలో 50 మందితో కలిసి మధుకర్ ప్రచారం నిర్వహించారు. 

సమాచారం అందుకున్న ఎఫ్ఎస్టీ టీమ్​తనిఖీలు చేసింది. ఎఫ్ఎస్టీ సభ్యుల ఫిర్యాదు మేరకు నార్నూర్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేయొద్దని, డబ్బులు, మద్యం, బహుమతులు పంచడం చట్టరీత్యా నేరమని వెల్లడించారు.