మాస్కు పెట్టుకోలేదని బ్రెజిల్ దేశాధ్యక్షుడిపై కేసు

 మాస్కు పెట్టుకోలేదని బ్రెజిల్ దేశాధ్యక్షుడిపై కేసు

సావో లూయిస్: కరోనా సునామీలా విరుచుకుపడుతున్న సమయంలో నిబంధనలు పాటించడంలో ఎవరూ నిర్లక్ష్యం వహించరాదన్న హెచ్చరికలను స్వయానా దేశాధ్యక్షుడే మాస్కుపెట్టుకోలేదని గుర్తించి ఆయనపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రెజిల్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 1.6 కోట్ల మంది కరోనా బారినపడగా 4 లక్షల 48 వేల మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపధ్యంలో  ప్రపంచ దేశాల్లో తరహా ఇక్కడ కూడా కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కు ధరించకపోవడం నేరం. ఈ పరిస్థితుల్లో మారన్ హమా రాష్ట్రంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మాస్కు పెట్టుకోలేదు. ప్రజలు కూడా భారీగా హాజరయ్యారు. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ ఫ్లావియో డైనో స్పందించి కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. దీనిపై అప్పీలుకు అధ్యక్షుడికి 15 రోజుల సమయం ఉంది. ఈ లోగా ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే జరిమానా విధించే అవకాశం ఉంది.