
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మరో వివాదంలో చిక్కుకుంది. ప్లేయర్ల నుంచి డబ్బులు వసూల్ చేశారన్న ఆరోపణలపై హెచ్సీఏ సెలక్షన్ కమిటీ సభ్యులపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు.
కాగా, హెచ్సీఏ తరుఫున అండర్ 19, అండర్ 23 లీగ్లలో ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారని.. డబ్బులు ఇవ్వకపోవడంతో మంచి ప్రదర్శన చేసినా తమ పిల్లలను ఆడనివ్వలేదని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఆటగాళ్ల తండ్రులు ఫిర్యాదు చేశారు. సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటగాళ్ల తండ్రుల ఫిర్యాదు మేరకు హెచ్సీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు.