సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు..

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు..

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర మొదలైంది.ఇటీవల మాజీ సీఎం జగన్ పై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా మరో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదయ్యింది.గతంలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు పోలీసులు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదని,ఆ విషయాన్ని వైద్యుడిగా తాను సర్టిఫై చేస్తానంటూ అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసింది టీడీపీ.

టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష, ఇతర నేతల ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పలరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు టీడీపీ శ్రేణులు.