
సినీ నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్, శ్రేయాస్ మీడియా పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ నెల( జూన్ ) 9 వ తేదీన నాని హీరోగా నటించిన 'అంటే సుందరానికి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాదాపూర్ లోని శిల్పకళావేదికలో నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఈ వేడుకను ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహించారని మైత్రీ మూవీ మేకర్స్, శ్రేయాస్ మీడియా పైన మాదాపూర్ పోలీసులు సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిన్న(జూన్ 10)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంటే సుందరానికి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నాని సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు.