గరిడేపల్లి మండలంలో బాలికపై లైంగిక దాడికి యత్నం.. యువకుడిపై కేసు

గరిడేపల్లి మండలంలో బాలికపై లైంగిక దాడికి యత్నం.. యువకుడిపై కేసు

గరిడేపల్లి, వెలుగు: బాలికపై లైంగికదాడికి యత్నించిన యువకుడిపై కేసు నమోదైన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.  పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. గరిడేపల్లి మండలంలోని ఓ గ్రామంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద పదేండ్ల బాలిక ఉంటుంది. మంగళవారం రాత్రి వీధిలో బాలిక ఆడుకుంటుండగా అమరవరపు సాయి(24), ఆమెకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. అక్కడికి ఎవరో వ్యక్తి రావడంతో ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బాలికను బెదిరించి ఇంటికి పంపాడు. 

రాత్రి తన అమ్మమ్మ ఇంటి వద్ద పడుకోగా మళ్లీ ఆ యువకుడు వెళ్లి బాలికను లేపడంతో గట్టిగా కేకలు వేసింది. ఆమె అమ్మమ్మ, చుట్టుపక్కల వాళ్లు రావడంతో యువకుడు పరార్ అయ్యాడు. ఘటనపై కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులకు సమాచారం అందించారు. బాలికను మెడికల్ టెస్ట్ లకు హుజూర్​నగర్ ఏరియా ఆస్పత్రికి పంపించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.