గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు

 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు

టాలీవుడ్ సెన్షేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను స్వామి వివేకానందుడితో పోలుస్తూ మంగళవారం వర్మ  వరుస ట్వీట్లు చేశాడు. వివేకానందడిని ఆదర్శంగా తీసుకునే భారతీయులకు, యువకుల మనోభావాలు దెబ్బతీసే విధంగా  వర్మ పోస్టులున్నాయంటూ ఏబీవీపీ విద్యార్థులు వర్మపై కేసు పెట్టారు. నిత్యం ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భారతీయ సంస్కృతిపై దాడి చేయడం వర్మకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.