బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పటాన్ చెరు పీఎస్లో కేసు నమోదు అయ్యింది. యాదాద్రి ఆలయంలో రీల్స్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై విశ్వ హిందు పరిషత్ (వీహెచ్పీ) నేత సుభాష్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాల దెబ్బతినేలా కౌశిక్ రెడ్డి వ్యవహారించారని.. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. సుభాష్ చంద్ర ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో వివాదం జరిగిన సమయంలోనూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అప్పుడు పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై కేసు నమోదు కాగా.. తాజాగా యాదాద్రిలో రీల్స్ చేయడంతో కౌశిక్ రెడ్డిపై ఎఫ్ఐర్ ఫైల్ అయ్యింది.
ALSO READ | దేశంలోనే తెలంగాణ కేబినెట్ బెస్ట్ : టీ పీసీసీ చీఫ్ మహేశ్