ఫేక్‌‌ ఈడీ ఆఫీసర్‌‌పై కేసు నమోదు‌‌

ఫేక్‌‌ ఈడీ ఆఫీసర్‌‌పై కేసు నమోదు‌‌

హైదరాబాద్‌‌,వెలుగు: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ (పీఎమ్‌‌ఓ) అధికారుల పేర్లతో మోసాలకు పాల్పడుతున్న సయ్యద్‌‌ బుర్హానుద్దీన్‌‌ అనే వ్యక్తిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళవారం హైదరాబాద్ లో అతడికి చెందిన పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు.

సయ్యద్ బుర్హనుద్దీన్ అతడి అనుచరుడు వెంకటరామ్  నకిలీ స్టాంప్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేసి హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారిని ఈడీ అధికారుల పేరుతో బెదిరించారు. ఈడీ, పీఎమ్‌‌ఓలో తమకు సంబంధాలు ఉన్నాయని నమ్మించారు. కేసులు లేకుండా చేసేందుకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారని పోలీసులు మీడియాకు వెల్లడించారు.