మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై నాంపల్లి స్టేషన్లో కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై నాంపల్లి స్టేషన్లో కేసు  నమోదు

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు చేశారు సిటీ పోలీసులు. కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు బుధవారం (మే 27)  నాంపల్లి పోలీలు కేసు నమోదు చేశారు. 2026 మే 26న చేసిన వివాదాస్ప వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన క్రమంలో కేసు రిజిస్టర్ చేశారు. 

మంగళవారం బాల్క సుమన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చేయాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో నాంపల్లి స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యక్రర్తలు... మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలి అంటూ బాల్క సుమన్  పిలుపునిచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 

  • అబిడ్స్ స్టేషన్లోనూ కేసు నమోదు:

బాల్క సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా అటు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. బాల్క సుమన్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ  ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ అబిడ్స్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలని కార్మికులను రెచ్చగొట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాల్క సుమన్ మాట్లాడిన ఆడియోను పోలీసులకు అందజేశారు.