సాయి ధరమ్ తేజ్ బైకుపై పెండింగ్ చలాన్ ఎవరో కట్టేశారు

సాయి ధరమ్ తేజ్ బైకుపై పెండింగ్ చలాన్ ఎవరో కట్టేశారు
  • బైక్ నడపడానికి లైసెన్స్ ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేస్తున్నాం
  • నిర్లక్ష్యం... ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశాము
  • మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ బైకుపై ఓ చలాన్ పెండింగులో ఉండిందని.. దాన్ని ఈరోజు ఎవరో చెల్లించారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ కు కారు డ్రైవింగ్ లైసన్స్ మాత్రమే ఉంది... బైకు నడపడానికి డ్రైవింగ్ లైసన్స్ ఉందా..? లేదా అన్న దానిపై విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. నిర్లక్ష్యం, రాష్  డ్రైవింగ్ కింద సాయి ధరమ్ తేజ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని.. ఐపీసీ279, 336, 184 మోటారు వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. ఎల్బీ నగర్ కి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి వద్ద సెకండ్ హ్యాండ్ లో సాయి ధరమ్ తేజ్ ఈ బైకు కొనుగోలు చేశాడని, గతంలో మాదాపూర్ లో ఓవర్ స్పీడ్ వెళ్లినందుకు ఈ బైక్ పై చలాన్ కూడా ఉందని, ఈరోజు ఆన్లైన్ లో ఎవరో చలాన్ కూడా పే చేశారని ఆయన వివరించారు. 
కేబుల్ బ్రిడ్జిపై 40కిలోమీటర్ల లోపు స్పీడ్ తోనే వెళ్లాలి
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై 30 నుంచి 40 స్పీడ్ మాత్రమే వెళ్లాలి.. కానీ సాయి ధరమ్ తేజ్ 100 స్పీడ్ వెళ్లాడు, యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లో 75 స్పీడ్ లో ఉన్నాడని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ డ్రైవింగ్ చేస్తూ లెఫ్ట్ సైడ్ నుంచి టేక్ టేకోవర్ చేయడానికి ట్రై చేశాడని, ఓవర్ స్పీడింగ్, రెక్లెస్ డ్రైవింగ్ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందన్నారు. హెల్మెట్ స్ట్రాప్ సరిగా పెట్టుకొని ఉంటే తలకు గాయం అయ్యేది కాదని గుర్తించామన్నారు.