
రంగారెడ్డి : ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పర్యటనను అడ్డుకున్నారంటూ 15 మంది రైతులు, వివిధ పార్టీల నాయకుల పై కేసు నమోదు చేశామన్నారు ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి . రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి యాచారం మండలం మేడిపల్లి పర్యటనకు రాగా .. గ్రామస్తులు ఆయన్ను అడ్డుకకున్నారు. ఆయనపై చెప్పులు, రాళ్లు విసిరారంటూ 15 మంది రైతులు, వివిధపార్టీల నాయకులపై కేసులు నమోదు చేశారు యాచారం పోలీసులు. గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసి ఏడుగురిని రిమాండ్ కు తరలించారు. గ్రామాల్లోకి ఎమ్మెల్యే ను రానివ్వకుండా అడ్డుకొని చెప్పులు, రాళ్లు విసిరినవారికై కేసు నమోదు చేసినట్లు ఏసీపి యాదగిరి రెడ్డి తెలిపారు.