నిబంధనలు ఉల్లంఘించిన మూడు పబ్బులపై కేసులు నమోదు

 నిబంధనలు ఉల్లంఘించిన మూడు పబ్బులపై కేసులు నమోదు

నిబంధనలు ఉల్లంఘించిన మూడు పబ్బులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ లోని అమ్నీషియా (Amensia), ఎయిర్ లైవ్ (Airlive), జీరో పార్ట్ (Zero part) పబ్బులపై కేసు రిజిస్టర్ చేశారు. దాంతో పాటు ఆయా పబ్బుల యజమాని, మేనేజర్లపైనా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. రాత్రి 10గంటల తర్వాత అధిక సౌండ్ తో పరిసర ప్రాంత ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నందున వీటిపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ తరహా ఘటనలపై హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ వాటిని బేకాతరు చేసిన పబ్బులపై కేసులు నమోదైనట్టు సమాచారం.

శబ్ద కాలుష్యాన్ని ప్రేరేపిస్తోన్న పబ్బులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. పబ్బుల్లో నిర్దిష్టమైన (సౌండ్స్)శబ్దాలు ఉండేలా చూసుకోవాలని, లేదంటే వారిపై కేసు నమోదు చేయొచ్చని పోలీసులను ఆదేశించింది. రాత్రి 10 గంటలు దాటితే డీజే లాంటి శబ్దాలు ఉండరాదని  తెలిపింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులరేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉంటుందని చెప్పింది.