కానిస్టేబుళ్లుగా ఎంపికైన 300 మందిపై కేసులు

కానిస్టేబుళ్లుగా ఎంపికైన 300 మందిపై కేసులు

రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం ఎంపిక చేసిన కొంత మందిపై కేసులు ఉన్నట్లు తెలంగాణ పోలీస్ నియామక మండలి తెలిపింది. మొత్తం 300 మందికి నేర చరిత్ర ఉన్నట్టు గుర్తించారు. వీరిలో దాదాపు 100 మంది అభ్యర్థులు తమపై ఉన్న కేసుల విషయాన్ని దాచి పెట్టారు. ఎంపికైన అభ్యర్థుల్లో పలువురిపై పోక్సో, హత్య కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ వారంలో పోలీస్ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో కేసులున్న వాళ్లకు సంబంధించి ఉన్నతాధికారులు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోలీస్ నియామక మండలి 2018 మే నెలలో సుమారు 17వేల మంది కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాథమిక అర్హత పరీక్ష, ఫిజికల్ టెస్ట్,  ప్రధాన పరీక్షల్లో అర్హత సాధించిన వాళ్లను కానిస్టేబుళ్లుగా ఎంపిక చేశారు. 13,373 మంది పురుషులు, 2652 మంది మహిళలు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు.

అయితే.. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమపై ఉన్న కేసుల గురించి తెలపాల్సి ఉంటుంది. కానీ దాదాపు 100 మంది అభ్యర్థులు తమపై కేసుల గురించి దాచిపెట్టినా.. పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో చేయించిన వ్యక్తిగత పరిశీలనలో ఈ కేసులు విషయాలు బయటపడ్డాయి.