యాదాద్రి, వెలుగు: నిషేధించిన హెచ్డీ కాటన్ విత్తనాలు, కల్తీ ఎరువులు అమ్మితే కేసులు నమోదు చేస్తామని యాదాద్రి అడిషినల్ కలెక్టర్ వెంకారెడ్డి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన విత్తనాలు, ఎరువుల డీలర్ల మీటింగ్లో ఆయన మాట్లాడారు. యాప్ ద్వారానే యూరియా బుకింగ్ చేసుకున్న రైతులకే అమ్మాలని సూచించారు.
నానో యూరియాను ఉపయోగించే విధంగా రైతులను డీలర్లు అవగాహన కల్పించాలన్నారు. అతిగా యూరియా వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని రైతులకు వివరించి యూరియా వాడకం తగ్గించే విధంగా చూడాలన్నారు. మీటింగ్లో డీఏవో వెంకట రమణారెడ్డి, ఏడీఏ నీలిమ ఉన్నారు.
