మోడీ ఫొటోను దహనం చేశారని 14 మందిపై  కేసులు నమోదు

మోడీ ఫొటోను దహనం చేశారని 14 మందిపై  కేసులు నమోదు

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : మోడీ ఫొటోను దహనం చేశారని సిరిసిల్ల టీఆర్ఎస్ లీడర్లపై కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేశారు. జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, కేటీఆర్ బాబాయి కల్వకుంట్ల గోపాల్ రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యలతో సహా 14 మందిపై  కేసులు నమోదు చేశారు. పెట్రోల్​ రేట్ల పెంపును నిరసిస్తూ మార్చి 24న సిరిసిల్ల ఎల్లమ్మ టెంపుల్ వద్ద ధర్నా చేసి ప్రధాని మోడీ  దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిపై సిరిసిల్ల బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ అన్నల్​దాస్​ వేణు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో కోర్టులో ప్రైవేట్ కేసువేశారు. దీంతో కోర్టు ఆదేశాలతో పోలీసులు 14 మంది టీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు.