అధికారంలోకి వస్తే కుల గణన చేపడ్తం: అఖిలేశ్​ యాదవ్​

అధికారంలోకి వస్తే కుల గణన చేపడ్తం: అఖిలేశ్​ యాదవ్​

లక్నో: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోగా కుల గణన చేపడతామని సమాజ్‌‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. ఎంఎస్‌‌పీకి చట్టబద్ధత కల్పించడంతో పాటు అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక ప్రతి ఫ్యామిలీకి రూ.500 విలువైన ఫ్రీ మొబైల్ డేటాను అందజేస్తామని ప్రకటించారు. బుధవారం ఆయన లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో  ‘జంతా కా మాంగ్ పత్ర – హుమారా అధికార్’  పేరిట 20 పేజీల పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో అఖిలేశ్ మాట్లాడుతూ.." సమాజ్‌‌వాదీ పార్టీ  అనేది ప్రతిపక్ష 'ఇండియా' బ్లాక్‌‌లో ఒక భాగం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో 'ఇండియా' కూటమి ప్రభుత్వం ఏర్పడితే కులాల వారీగా జనాభాను లెక్కిస్తం. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి సాయుధ బలగాల్లో రెగ్యులర్ రిక్రూట్‌‌మెంట్‌‌ను ప్రవేశపెడతం. 2025 నాటికి ఖాళీగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులవారి అన్ని ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తం.