ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌ల కేటాయింపుల్లో క్యాట్ ఉత్తర్వులు చెల్లవు

ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌ల కేటాయింపుల్లో క్యాట్ ఉత్తర్వులు చెల్లవు
  • హైకోర్టులో కేంద్రం వాదన

హైదరాబాద్, వెలుగు: ప్రత్యేక కమిటీ గైడ్‌‌‌‌లైన్స్ ప్రకారమే తెలంగాణ, ఏపీలకు కేంద్ర సర్వీస్ ఆఫీసర్ల విభజన జరిగిందని హైకోర్టుకు కేంద్రం తెలిపింది. 15 మంది ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌ అధికారుల నియామకాల్లో కేంద్ర అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌‌‌‌ (క్యాట్) ఉత్తర్వులు చెల్లవని వాదించింది. క్యాట్ ఆదేశాలు సవాలు చేస్తూ హైకోర్టులో కేంద్రం వేసిన రిట్ పిటిషన్లను జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌ ఎస్‌‌‌‌.నందల డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. 15 మంది అధికారుల నియామక ఉత్తర్వులపై విడివిడిగా విచారణ జరుపుతామని చెప్పింది. క్యాట్‌‌‌‌ ఆదేశాలు చెల్లబోవని అదనపు సొలిసిటర్ జనరల్‌‌‌‌ సూర్యకరణ్‌‌‌‌రెడ్డి వాదించారు. వాదనలు విన్న బెంచ్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఐదుగురు సభ్యులతో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ప్రకారం సీఎస్‌‌‌‌ సోమేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను కూడా ఏపీకి కేటాయించారు. అయితే ఏపీకి కేటాయించడాన్ని క్యాట్‌‌‌‌లో ఆయన సవాల్‌‌‌‌ చేశారు.