కేటరర్స్ కిచెన్​తో అనారోగ్యాల పాలైతున్నం

కేటరర్స్ కిచెన్​తో అనారోగ్యాల పాలైతున్నం

 

  • ప్రజారోగ్యం దృష్ట్యా మరో చోటుకు తరలించాలి
  •  అధికారులకు ఓ అపార్ట్ మెంట్ వాసుల కంప్లయింట్ 

పద్మారావునగర్​, వెలుగు: కమర్షియల్​కిచెన్​కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని బోయిగూడ వై జంక్షన్​లోని ఎంఎన్​కే విట్టల్​ సెంట్రల్​ కోర్టు అపార్ట్​మెంట్ వాసులు కలెక్టర్, బల్దియా కమిషనర్, హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులకు బుధవారం లేఖ ద్వారా కంప్లయింట్ చేశారు. తమ అపార్ట్​ మెంట్ పక్కనే  కేటరర్స్ కిచెన్​లో ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి వంట పాత్రల చప్పుళ్లు, నూనెల పొగ, ఎగ్జాస్ట్​ ఫ్యాన్లతో నూనె ఆవిరి, వాసనలతో శ్వాస పీల్చుకోలేకపోతున్నామని అపార్ట్ మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదిడ్డంగా పేర్చిన గ్యాస్​ సిలిండర్లతో కూడా ప్రమాద ముప్పు ఉందని పేర్కొన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా నివాసిత ప్రాంతం నుంచి కేటరర్స్ కిచెన్ ను మరో చోటికి తరలించాలని అధికారులను కోరారు.