సందీప్ కిషన్ సిగ్మా మూవీలో స్పెషల్‌‌గా కేథరిన్ థ్రెసా

సందీప్ కిషన్ సిగ్మా మూవీలో స్పెషల్‌‌గా కేథరిన్ థ్రెసా

తనదైన గ్లామర్‌‌‌‌తో యూత్‌‌ను ఆకట్టుకునే కేథరిన్ థ్రెసా... ఇప్పుడు ఓ స్పెషల్‌‌ సాంగ్‌‌లో కనిపించబోతోంది. సందీప్ కిషన్ నటిస్తున్న ‘సిగ్మా’ చిత్రంలో ఆమె స్పెషల్‌‌ అప్పియరెన్స్‌‌ ఇవ్వబోతోందని  శుక్రవారం ప్రకటించారు. తమన్ కంపోజ్ చేసిన  ఈ మాస్  పాటలో సందీప్ కిషన్, కేథరిన్‌‌ల డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్‌‌గా నిలుస్తాయని మేకర్స్ చెప్పారు.   కలర్‌‌ఫుల్ సెట్‌‌లో ఈ సాంగ్‌‌ను చిత్రీకరిస్తున్నారు.  

కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.  ఫరియా అబ్దుల్లా,  రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా,  మగలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే  కొన్ని ప్రత్యేక అతిధి పాత్రలు ఉన్నాయని అన్నారు.  

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.  తెలుగు, తమిళ భాషల్లో  తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సమ్మర్‌‌‌‌లో రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నారు.