రోడ్లపై పశువులను అలా వదిలేస్తావా : యజమానికి 3 ఏళ్లు జైలు

రోడ్లపై పశువులను అలా వదిలేస్తావా : యజమానికి 3 ఏళ్లు జైలు

గుజరాత్ లో  పశువులను రోడ్లపైకి వదిలిన యజమానికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది అహ్మదాబాద్ సెషన్  కోర్టు.   జూన్ 2019లో సబర్మతి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరియం రోడ్డులో  హరగోవింద్ దేశాయ్‌కు పశువులను రోడ్డుపై వదిలేశారు.  పశువులను తీసుకెళ్లిన  పోలీసులు.. యజమాని తన జంతువులను నిర్లక్ష్యంగా వదిలేసినందుకు.. ప్రజాభద్రతకు హాని కలిగించాడని పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరపగా  పశువుల యజమాని హరగోవింద్ దేశాయ్‌కు అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

ALSO READ :- Murder Mubarak Trailer: నెట్‌ఫ్లిక్స్లో మరో బ్లడీ థ్రిల్లర్..మర్డర్ ముబారక్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పశువులను బహిరంగ వీధుల్లోకి వదలడం వల్ల  ప్రయాణికుల ప్రాణాలకు హాని కలిగించాడని  దేశాయ్ ను దోషిగా తేల్చారు అదనపు సెషన్స్ జడ్జి సారంగ వ్యాస్ . రోడ్లపై  విచ్చలవిడి జంతువుల వల్ల సంభవించే ప్రమాదాల తీవ్రతను ప్రాణనష్టాన్ని తెలిపారు.   ఇలాంటి జరగకుండా ఉండాలంటే కఠిన శిక్ష విధించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో యజమాని దేశాయ్ కి  మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.