రిపోర్టర్​పై బైడెన్ బూతు పురాణం

రిపోర్టర్​పై బైడెన్ బూతు పురాణం

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ రిపోర్టర్​పై ఆయన నోరు పారేసుకున్నారు. ధరల పెరుగుదల గురించి ప్రశ్నలు అడిగిన విలేకరిపై అసభ్య పదజాలంతో బైడెన్ సమాధానం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. అసలేం జరిగిందంటే.. వాషింగ్టన్​లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అధ్యక్షుడు బైడెన్​ను.. ఫాక్స్ న్యూస్ ప్రతినిధి పీటర్ డూసీ ధరల పెరుగుదలపై ప్రశ్నించారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల మిడ్​ టర్మ్ ఎలక్షన్స్​ ఫలితాలపై ప్రభావం పడుతుందా అని అడిగారు. దీనికి బదులిచ్చిన బైడెన్.. 'అధిక ద్రవ్యోల్బణంతో లాభమే..' అంటూ ఓ అసభ్య పదాన్ని వాడుతూ జవాబిచ్చారు. ఇదంతా కెమెరా, మైక్రోఫోన్లలో రికార్డైంది.
దీనిపై వైట్ హౌస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, రిపోర్టర్​కు బైడెన్ క్షమాపణ చెప్పినట్లు సమాచారం. 


పీటర్ డూసీని బైడెన్ తన ఆఫీస్ కు పిలిచినట్లు అధికారులు వెల్లడించారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేందుకు ఆయన్ను రమ్మన్నట్లు చెప్పారు. కాగా, ఇతర సందర్భాల్లోనూ బైడెన్ తనకు నచ్చని విషయాల మీద ప్రశ్నిస్తే రిపోర్టర్లను దూషించాడని న్యూయార్క్ పోస్ట్ వార్తాపత్రిక నివేదించింది. గత వారం బైడెన్ ఒక మహిళా ఫాక్స్ న్యూస్ రిపోర్టర్‌పై కూడా ఇలాగే దాడి చేయడం గమనార్హం. "సర్, (రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్) పుతిన్ కోసం మీరు ఎందుకు వేచి ఉన్నారు?" అనివిలేకరి అడగ్గా.. దానికి బైడెన్, "ఏమిటీ.. తెలివితక్కువ ప్రశ్న" అని బదులిచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

27న సిటీలో తాగునీటి సరఫరాకు అంతరాయం

కరోనా ఎఫెక్ట్.. ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం

అతడు వన్డేలకు పనికి రాడు.. గంభీర్ సంచలన కామెంట్స్