ఐటీఆర్​ ఫామ్స్‌‌ను నోటిఫై చేసిన సీబీడీటీ

ఐటీఆర్​ ఫామ్స్‌‌ను నోటిఫై చేసిన సీబీడీటీ

 న్యూఢిల్లీ :  2024-–25 అసెస్‌‌‌‌మెంట్ సంవత్సరానికి పన్ను రిటర్న్‌‌‌‌లను దాఖలు చేయడానికి ఐటీ రిటర్న్ ఫామ్స్‌‌‌‌‌ 2, 3,  5 లను నోటిఫై చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం తెలిపింది.   మొత్తం రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు దాఖలు చేయాల్సిన ఐటీఆర్​–-1,  కంపెనీల కోసం ఐటీఆర్–​-6లను ఇది వరకే ప్రకటించారు.  అన్ని ఐటీఆర్​ ఫామ్స్‌ 1 నుంచి 6 వరకు నోటిఫై చేశారు. ఇవి ఏప్రిల్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం లేని వ్యక్తులు  హెచ్​యూఎఫ్​ లు ( ఐటీఆర్​ ఫారం-1 (సహజ్) దాఖలు చేయడానికి అర్హత లేనివారు) ఐటీఆర్–-2ని ఫైల్ చేయవచ్చు.

వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం ఉన్నవారు ఐటీఆర్​ ఫామ్‌-–3ని ఫైల్ చేయవచ్చు.  నివాసితులు, హెచ్​యూఎఫ్​లు,  సంస్థలకు (ఎల్​ఎల్​పీ కాకుండా) రూ. 50 లక్షల వరకు మొత్తం ఆదాయం  వ్యాపారం,  వృత్తి ద్వారా ఆదాయం కలిగి ఉంటే ఐటీఆర్-​-4 (సుగమ్) దాఖలు చేయాలి. భాగస్వామ్య సంస్థలు,  ఎల్​ఎల్​పీలు ఐటీఆర్​ ఫారం–-5ని ఫైల్ చేయవచ్చు.  సెక్షన్ 11 కింద మినహాయింపును క్లెయిమ్ చేసేవి మినహా మిగతా అన్ని కంపెనీలు   ఐటీఆర్​ ఫారం–-6ని దాఖలు చేయాలని సీబీడీటీ తెలిపింది.