20 లక్షల లంచం.. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌‌ని అరెస్ట్ చేసిన సీబీఐ

20 లక్షల లంచం.. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌‌ని అరెస్ట్ చేసిన సీబీఐ

ముంబైకి చెందిన నగల వ్యాపారి నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకున్న ఆరోపణలపై ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ను సీబీఐ గురువారం(ఆగష్టు 08) అరెస్ట్ చేసింది. సదరు అధికారిని సందీప్ సింగ్ యాదవ్‌గా గుర్తించారు. ఢిల్లీలో అతడిని అరెస్టు చేసినట్లు  సీబీఐ అధికారులు తెలిపారు. 

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆగస్టు 3, 4 తేదీలలో ముంబైలోని ఓ నగల వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఆ సోదాల అనంతరం ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ సదరు నగల వ్యాపారి కొడుకుకు ఫోన్ చేశారు. లంచం రూపంలో రూ. 25 లక్షలు చెల్లించాలని, లేనియెడల అరెస్టు చేస్తానని బెదిరించాడు. అనంతరం చర్చల ద్వారా ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు తగ్గించాడు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) అధికారి అయిన యాదవ్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.