వివేకా లెటర్‌పై సీబీఐ ఆరా.. విచారణకు పీఏ, వంట మనిషి కొడుకు

వివేకా లెటర్‌పై సీబీఐ ఆరా.. విచారణకు పీఏ, వంట మనిషి కొడుకు

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. అందులో భాగంగా వివేకా లెటర్ పై సీబీఐ ఆరా తీస్తోంది. వివేకా పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకు ప్రకాష్ లు విచారణకు హాజరు కాగా.. సీబీఐ వారిని ప్రశ్నిస్తోంది. వారిద్దర్నీ కలిపి సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.

 వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు లెటర్ దాచి పెట్టడంపై ప్రకాష్ ను సీబీఐ పలు ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు మే 2న వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారించి, వాంగ్మూలం నమోదు చేసుకున్న  సీబీఐ.. ఈ రోజు వంట మనిషి కొడుకు ప్రకాష్ విచారిస్తోంది. పీఏ కృష్ణారెడ్డి ద్వారా లెటర్ ను దాచి పెట్టాడని ప్రకాష్ పై ఆరోపణలున్న సంగతి తెలిసిందే.