ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో నాలుగున్నర గంటలపాటు అధికారులు ఆయన్ను విచారించారు. ఇదే కేసులో అరెస్టైన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ చేసినట్లు తెలుస్తోంది. అవినాష్ కాల్ డేటా, బ్యాంకు ట్రాన్సక్షన్స్పై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. సీబీఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చానని అవినాష్ రెడ్డి చెప్పారు. మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతానని స్పష్టం చేశారు. విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐ అధికారులను కోరినట్లు చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన విషయాలు బహిర్గతం చేయలేనని అన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.