అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ చేయాలి

అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ చేయాలి

 

గ్రానైట్ కంపెనీలు అక్రమాలకు పాల్పతున్నాయని ఆరోపించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయని..దీనిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన..గ్రానైట్ కంపెనీల అక్రమాలతో అధికారులు, రాజకీయ నేతలు లబ్ది పొందుతున్నారన్నారు. అధికారం లోకి రాక ముందు TRS ప్రభుత్వం ఈ అక్రమాలపై ఆరోపణలు చేసిందని.. ఇప్పుడు అధికారం లోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందే చేస్తోందన్నారు. మాట వినకుంటే యాక్టింగ్ సీఎంలు మైనింగ్ మంత్రులను మారుస్తున్నారన్నారు. మైనింగ్ కుంభకోణంపై కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. ప్రధాని, గవర్నర్, ఈడీని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. అక్రమ మైనింగ్‌పై కోర్టులో పిల్ వేస్తామని ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు.