తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్..

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల కల్తీ నెయ్యి కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతున్న ఈ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో A16 గా ఉన్న కీలక నిందితుడు అజయ్ కుమార్ సుగంద్ ను అరెస్ట్ చేసింది సీబీఐ సిట్. అజయ్ కూమార్ మోన్ గ్రీజరాయిడ్స్, అసటిక్ యాసిడ్ యాస్టర్ లాంటి కెమికల్ ను బోలేబాబా  కంపెనీ కి సరఫరా చేసినట్లు గుర్తించింది సిట్. 

లడ్డూలు తయారు చేసే నెయ్యిలో 90 శాతానికి పైగా పామాయిల్‌ వినియోగించినట్లు గుర్తించింది సిట్. పామాయిల్ తయారికి మోన్ గ్రీజరాయిడ్స్, అసటిక్ యాసిడ్ యాస్టర్ లాంటి కెమికల్స్ వాడినట్లు గుర్తించింది సిట్. అజయ్ కుమార్ గత ఏడేళ్లుగా బోలే బాబాకు పామాయిల్ తయారు చేయడానికి కెమికల్స్ ను సరఫరా చేస్తున్నట్లు తెలిపింది సిట్. 

నిందితుడు అజయ్ కుమార్ ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు సిట్ అధికారులు. ఈ క్రమంలో అజయ్ కుమార్ కు నవంబర్ 21 వరకు రిమాండ్ విధించింది కోర్టు.