లాలూ బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించిన సీబీఐ

లాలూ బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించిన సీబీఐ

దాణా కుంభకోణం కేసుల్లో జైలు శిక్ష పడిన బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సీబీఐ గట్టి షాక్‌ ఇచ్చింది. అయితే లాలూ బెయిల్ పిటిషన్‌‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు తీవ్ర స్థాయిలో తన స్పందన తెలియజేసింది. వైద్యం పేరిట బెయిల్ కోసం లాలూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనీ.. ఆయన అసలు ఉద్ధేశ్యం లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ కార్యకలాపాలేనని సీబీఐ ఆరోపించింది. ప్రస్తుతం లాలూ ఉంటున్న రాంచీ ఆస్పత్రిలో ఇటీవల ఆయనతో సమావేశమైన రాజకీయ నాయకుల జాబితాను కూడా కోర్టుకు సమర్పించింది. లాలూ ప్రవర్తనను బట్టి ఆయనకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. లాలూ బెయిల్ పిటిషన్ రేపు(బుధవారం) సుప్రీంకోర్టు ముందుకు రానుంది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ లాలూ తరపున ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు.