సీబీఐ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ సుధారాణి పదవీకాలం పొడిగింపు

V6 Velugu Posted on Sep 14, 2021

  • మరో రెండేళ్లు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు

న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌గా ఉన్న రేలంగి సుధారాణి పదవీ కాలాన్ని పొడిగించారు. గత నెల 19న ఆమె పదవీకాలం ముగిసింది. అయితే  ఆమె పదవీ కాలం మరో రెండేళ్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర్వులు జారీ చేసిన ఈ తేదీ నుంచి మరో రెండేళ్లు పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పర్సనల్ అండ్‌ ట్రైనింగ్‌ డిప్యూటీ కార్యదర్శి నిధి శ్రీవాత్సవ ఉత్తర్వులు జారీ చేశారు.
 

Tagged , CBI updates, CBI Director Sudha Rani Relangi, CBI Prosecution Director Sudha Rani, Department of Personneland training DC, CBI DC Nithi Srivathsava

Latest Videos

Subscribe Now

More News