
కాశీబుగ్గ, వెలుగు: సీబీఎస్ఈ ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థలు జయకేతనం ఎగురవేశాయి. ఈ సందర్భంగా ఎస్సార్ విద్యా సంస్థల చైర్మన్ వరదా రెడ్డి మాట్లాడుతూ..క్రమశిక్షణలో కూడిన పటిష్టమైన విద్యా బోధన, అంకిత భావం కలిగిన టీచర్స్ ఉండటంతోనే ఇంతటి విజయం సాధ్యమైందని తెలిపారు.
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జి. సాయి హర్షిణి 480/500, ఆర్. స్వస్తిక 478, సీహెచ్. అన్సీక 477, కె.అంజనా సంతోషి 475, ఎ. అమూల్య 472, వి. ప్రత్యున్న రెడ్డి 470 మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, టీచర్లు, స్టూడెంట్లు తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ ఫలితాల్లోను హవా
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో ఎస్సార్విద్యా సంస్థలు ప్రభజనం సృష్టించాయి. విద్యాసంస్థలకు చెందిన ఎం. రిషి 500/498 మార్కులు, వి. వివేకానంద రెడ్డి 487 మార్కులు, కె. జశ్వంత్ 487, బి. హృషీకేష్ మూర్తి 485, ఎ. సాయి కశ్యప్ 484, పి. ఆదిలాష్ రెడ్డి 481మార్కులు సాధించారని చైర్మన్ వరదా రెడ్డి వెల్లడించారు.