CBSE కొత్త రూల్స్ : స్కూల్‌ డ్రెస్‌ తో వస్తేనే పరీక్షకు ఎంట్రీ

CBSE కొత్త రూల్స్ : స్కూల్‌ డ్రెస్‌ తో వస్తేనే పరీక్షకు ఎంట్రీ
  • 15 నుంచి సీబీఎస్ఈ పన్నెండో తరగతి
  • 21 నుంచి టెన్త్ పరీక్షలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పది, పన్నెండో తరగతి పరీక్షల్లో సీబీఎస్ఈ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. విద్యార్థులకు స్కూల్‌‌‌‌‌‌‌‌ డ్రెస్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరి చేసింది. ఐడీకార్డులు తెచ్చుకోవాలని, అడ్మిట్ కార్డుల్లో పేరెంట్స్ సంతకం తప్పనిసరి అని సూచించింది. రాష్ట్రంలో 300 వరకు ఉన్న సీబీఎస్ఈ సిలబస్ స్కూల్స్‌‌‌‌‌‌‌‌ లో పది, పన్నెండో తరగతి విద్యార్థులు 20 వేల మంది వరకు ఉన్నారు.

పన్నెండో తరగతి విద్యార్థులకు ఈనెల 15 నుంచి ఒకేషనల్‌‌‌‌‌‌‌‌, మైనర్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌, మార్చి 2 నుంచి ప్రధాన పరీక్షలు, పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 21 నుంచి ఒకేషనల్‌‌‌‌‌‌‌‌, మైనర్‌‌‌‌‌‌‌‌ ఎగ్జా మ్స్‌‌‌‌‌‌‌‌, మార్చి 2వ తేదీ నుంచి ప్రధాన పరీక్షలు ప్రారంభం కానున్నాయి.