స్ట్రీమ్ ఎంగేజ్..తాత త్యాగం

స్ట్రీమ్ ఎంగేజ్..తాత త్యాగం

తాత త్యాగం

టైటిల్ : కాల్వన్‌‌‌‌, డైరెక్షన్ : పీవీ శంకర్‌‌‌‌‌‌‌‌ 
కాస్ట్ : జీవీ ప్రకాశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, భారతీరాజ, ఇవాన, ధీన, జ్ఞానసంబంధం, జి.ఢిల్లీబాబు
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్‌‌‌‌ హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ 

ఒక అడవి పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు. ఇలా అడవికి ఆనుకుని ఉన్న గ్రామాలపై ఏనుగుల గుంపులు అప్పుడప్పుడు దాడులు చేస్తుంటాయి. అదే ఊళ్లో కెంబ‌‌‌‌న్ అలియాస్​ కెంబరాజు (జీవీ ప్రకాశ్​కుమార్‌‌‌‌), త‌‌‌‌న స్నేహితుడు సూరితో(దీనా) క‌‌‌‌లిసి ఉంటాడు. ఈ ఇద్దరూ అనాథ‌‌‌‌లు. ఊళ్లోనే  చిన్న దొంగ‌‌‌‌త‌‌‌‌నాలు చేస్తూ బతుకుంటారు. ఒక రోజు అదే ఊళ్లో ఉండే బాలామ‌‌‌‌ణి (ఇవానా) ఇంట్లో దొంగ‌‌‌‌తనానికి వెళ్తారు. కానీ.. చాలా తెలివిగా వాళ్లను పోలీసుల‌‌‌‌కు ప‌‌‌‌ట్టిస్తుంది బాలామ‌‌‌‌ణి. ఆమె ధైర్యం, అంద‌‌‌‌ం చూసి లవ్‌‌‌‌లో పడతాడు కెంబ‌‌‌‌న్‌‌‌‌. 

ఆ విషయం బాలామణికి తెలిసి అత‌‌‌‌డిని ‘దొంగ’ అంటూ అవ‌‌‌‌మానిస్తుంది. దాంతో ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో వృద్ధాశ్రమంలో ఉంటున్న ఒక పెద్దాయన (భార‌‌‌‌తీరాజా)ని తాత‌‌‌‌గా దత్తత తీసుకుంటాడు. అతన్ని త‌‌‌‌న ఇంటికి తీసుకొస్తాడు. కెంబన్ మంచిత‌‌‌‌నానికి బాలామ‌‌‌‌ణి కూడా అత‌‌‌‌డితో ప్రేమ‌‌‌‌లో ప‌‌‌‌డుతుంది. అయితే.. ఈ దత్తత వెనుక అసలు ప్లాన్ మరొకటి ఉందని ఆమెకి తెలియదు. అది అడవికి ఆనుకుని ఉన్న గ్రామం కావడంతో ఏనుగుల దాడిలో అక్కడ ఎవరైనా చనిపోతే.. వాళ్ల కుటుంబానికి ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తుంది. 

కెంబన్ కూడా తను తాతగా దత్తత తీసుకున్న పెద్దాయనని ఎలాగైనా ఏనుగులు చంపేలా చేసి, డబ్బు కాజేయాలి అనుకుంటాడు. ఆ ప్లాన్‌‌‌‌తోనే అతన్ని కులదైవం దర్శనం చేసుకోవడానికి అని చెప్పి.. ఏనుగులు తిరిగే ప్లేస్‌‌‌‌కి తీసుకెళ్తాడు. కానీ.. ఆ తాత ఎలాంటి జంతువునైనా క్షణాల్లో మ‌‌‌‌చ్చిక చేసుకోగలడు. ఆ తర్వాత ఏం జరిగింది? కెంబ‌‌‌‌న్ కుట్ర గురించి తాత‌‌‌‌కు తెలిసిందా? ఏనుగులు అతన్ని చంపేశాయా? తెలియాలంటే సినిమా చూడాలి.   

రక్త చరిత్ర

టైటిల్ : బస్తర్‌‌‌‌‌‌‌‌ : ది నక్సల్‌‌‌‌ స్టోరీ
డైరెక్షన్ : సుదీప్తో సేన్
కాస్ట్ : అదా శర్మ, యశ్‌‌‌‌పాల్ శర్మ, రైమా సేన్, నమన్ జైన్, కిషోర్ కదమ్, ఇందిరా తివారి
ప్లాట్​ ఫాం : జీ 5

చత్తీస్‍గఢ్‍ రాష్ట్రంలోని సుక్మాలో 2010లో జరిగిన నక్సలైట్ల దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ ఘటన ఆధారంగా ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా తీశారు. నక్సలైట్ల ప్రాబల్యం బస్తర్ ప్రాంతం మీద  ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది? అక్కడివాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనే అంశాలతో తీశారు. నక్సలైట్లు ఆ ప్రాంత ప్రజలను భయపెట్టినట్టు, దళాలను, అధికారులను చంపినట్టు ఇందులో చూపించారు. 


కథలోకి వెళ్తే.. బస్తర్‌‌‌‌‌‌‌‌లో కొంతమంది గిరిజనులు ఊళ్లో జాతీయ జెండా ఎగురవేస్తారు. ఆ కార్యక్రమంలో స్కూల్ టీచర్ మిలింద్ కశ్యప్ (సుబ్రతా దత్తా), అతని భార్య రత్న (ఇందిరా తివారీ), కొడుకు, కూతురు పాల్గొంటారు. అప్పుడే మావోయిస్టులు దాడి చేసి, ఈ ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ల స్థావరానికి తీసుకెళ్తారు. అక్కడ కామ్రేడ్ లంకారెడ్డి (విజయ్ కృష్ణ) అనే మావోయిస్టు, అతడి అనుచరురాలు లక్ష్మి (అనంగ్షా బిశ్వాస్), మిగతా దళ సభ్యులు ఉంటారు. 

మిలింద్ కశ్యప్ ఐపీఎస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ నీరజకు ఇన్‌‌‌‌ఫార్మర్‌‌‌‌గా ఉన్నందుకు నరికి చంపేస్తాడు లంకారెడ్డి. ఆ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావాన్ని తగ్గించేందుకు గవర్నమెంట్ పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ నీరజా మాధవన్ (అదా శర్మ)ను అపాయింట్ చేస్తుంది. కానీ.. ఆమె నకిలీ ఎన్‍కౌంటర్లు చేశారని కోర్టులో వాదిస్తుంటాడు లాయర్ నీలమ్ నాగ్‍పాల్ (శిల్పా శుక్లా). అదే టైంలో నక్సలైట్ల యాక్టివిటీ విపరీతంగా ఉంటుంది. అలాంటి ప్లేస్‌‌‌‌లో నీరజ నక్సలైట్లను ఆపగలిగిందా? అక్కడ ఏం జరిగింది? అనేదే అసలు కథ. 


రాజకీయ కుట్ర

టైటిల్ : తలైమై సెయలగమ్‌‌‌‌
డైరెక్షన్ : వసంతబాలన్‌‌‌‌
కాస్ట్ : కిషోర్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌.జి, శ్రియారెడ్డి, భరత్‌‌‌‌, కని కుశ్రుతి, సంతాన భారతి, రమ్యా నంబీషన్‌‌‌‌, ఆదిత్య, శ్రేయా రెడ్డి 
ప్లాట్​ ఫాం : జీ 5

అరుణాచలం (కిషోర్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌.జి) తమిళనాడు సిట్టింగ్ సి.ఎం. వరుసగా మూడో సారి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తుంటాడు. కానీ.. కొన్నేండ్ల నాటి ఒక కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటాడు. దాంతో.. అతను జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. అలా జరిగితే.. పార్టీ పరిస్థితి అగమ్యగోచరం. మళ్లీ అరుణాచలం పదవి దక్కించుకోవడం చాలా కష్టం. అందుకే ఆ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తుంటాడు. తాను నిర్దోషిని అని నిరూపించడానికి జర్నలిస్ట్‌‌‌‌ కొట్రవై (శ్రియా రెడ్డి) సాయం తీసుకుంటాడు. 

మరోవైపు అతని క్యాబినెట్‌‌‌‌లోనే మంత్రులుగా ఉన్న అతని కూతురు అముద (రమ్య నంబీశన్), రెండో కూతురి భర్త హరిహరన్ (నిరూప్ నందకుమార్) అరుణాచలం జైలుకు వెళ్తే ముఖ్యమంత్రి కావాలని చూస్తుంటారు. అందుకే వీళ్ల కంటే ఎక్కువగా కొట్రవైని నమ్ముతాడు అరుణాచలం. ఇంతలోనే జార్ఖండ్‌‌‌‌లో జరిగిన హత్య, చెన్నయ్​ శివార్లలో జరిగిన వరుస హత్యలకు, రాష్ట్ర రాజకీయలకు లింక్ ఉన్నట్లు అనుమానిస్తారు పోలీసులు. జార్ఖండ్‌‌‌‌లో జరిగిన హత్య వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకునేందుకు సీబీఐ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ నవాజ్‌‌‌‌ఖాన్ (ఆదిత్య మీనన్) ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ ఈ కేసులతో అరుణాచలానికి, తమిళనాడు రాజకీయాలకు సంబంధం ఏంటి? అరుణాచలం జైలుకి వెళ్లాడా? లేదా? తెలియాలంటే.. ఈ సిరీస్‌‌‌‌ చూడాల్సిందే.

ఇంటి కోసం విడాకులు

టైటిల్ : జర హట్ కే జర బచ్​కే
డైరెక్షన్ : లక్ష్మణ్ ఉటేకర్
కాస్ట్ : విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్, ఇనాముల్హాక్
ప్లాట్​ ఫాం :  జియో సినిమా

యోగా ట్రైనర్‌‌‌‌‌‌‌‌ కపిల్ దూబే ( విక్కీ కౌశల్ ), కెమిస్ట్రీ ప్రొఫెసర్ సౌమ్య చావ్లా ( సారా అలీ ఖాన్ ) లవ్​ మ్యారేజి చేసుకుంటారు. పెండ్లి జరిగిన తర్వాత సౌమ్య అత్తారింట్లో అడుగుపెడుతుంది. కపిల్‌‌‌‌ వాళ్లది ఒక మధ్య తరగతి కుటుంబం. ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. దాంతో కొడుక్కి తమ గదిని ఇచ్చి, కపిల్​ తల్లిదండ్రులు హాల్లో పడుకుంటారు. భర్తతో సరదాగా గడపాలి అనుకునే సౌమ్యకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. 

దాంతో.. మరో ఇంటికి మారాలని ప్రయత్నాలు మొదలుపెడతారు. కానీ.. బడ్జెట్‌‌‌‌లో ఇల్లు దొరక్క గవర్నమెంట్‌‌‌‌ ఇల్లు ఇచ్చే పథకానికి ధరఖాస్తు చేసుకుంటారు. ఆ పథకంలో ఇల్లు రావాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటి ప్రకారం అయితే వీళ్లకు ఇల్లు రాదు. కానీ.. అక్కడ పనిచేసే ఒక అవినీతి అధికారి భగవాన్ దాస్ (ఇనాముల్హాక్) ‘విడాకులు తీసుకుంటే ఇల్లు మంజూరు అవుతుంద’ని సలహా ఇస్తాడు. అతని సలహాతో కపిల్‌‌‌‌, సౌమ్య విడాకులు తీసుకున్నారా? వాళ్లకు ప్రభుత్వ పథకంలో ఇల్లు వచ్చిందా? వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాలి. థియేటర్లలో రిలీజైన11 నెలలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చినా జనాలను బాగానే ఆకట్టుకుంటోంది. అప్పట్లో కూడా రొమాంటిక్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా మంచి హిట్‌‌‌‌ కొట్టింది.  

ఇగో తెచ్చే తిప్పలు

టైటిల్ : విద్య వాసుల అహం
డైరెక్షన్ : మణికాంత్‌‌‌‌ గెల్లి
కాస్ట్ : రాహుల్‌‌‌‌ విజయ్‌‌‌‌, శివానీ రాజశేఖర్‌‌‌‌, అవసరాల శ్రీనివాస్‌‌‌‌, అభినయ, కాశీ విశ్వనాథ్‌‌‌‌, రూపా లక్ష్మి
ప్లాట్​ ఫాం : ఆహా

వాసు (రాహుల్‌‌‌‌ విజయ్‌‌‌‌) వైజాగ్‌‌‌‌లోని ఓ కంపెనీలో మెకానికల్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుంటాడు. ఇంట్లో పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తుండడంతో చివరికి ‘ఓకే’ చెప్తాడు. అదే సిటీలో ఉంటున్న విద్య (శివానీ రాజశేఖర్‌‌‌‌)కు కూడా పెళ్లంటే ఇష్టం ఉండదు. కానీ.. తన తల్లి ఇబ్బంది పెడుతుండడంతో ఓ కండిషన్‌‌‌‌తో ‘ఓకే’ చెప్తుంది. తాను పెట్టిన టెస్ట్‌‌‌‌లో పాస్‌‌‌‌ అయిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఆ టెస్ట్‌‌‌‌లో మంచి మార్కులు సాధించి విద్యని పెండ్లి చేసుకుంటాడు వాసు. పెండ్లి జరిగిన వెంటనే ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. వాటికి కారణం.. ఇద్దరిలో ఉన్న అహమే. అయితే.. వాళ్ల ఇగో వల్ల ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది? చివరికి ఇద్దరూ కలిశారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.