దూరదర్శన్‌లో AI యాంకర్స్: క్రిష్​, భూమి

దూరదర్శన్‌లో AI యాంకర్స్:  క్రిష్​, భూమి

రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక చానల్​ డీడీ కిసాన్​ కు మే 26తో తొమ్మిదేళ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో దూరదర్శన్​ ఐఏ క్రిష్​, ఏఐ భూమి పేరిట కృత్రిమ మేధ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. దీనిద్వారా దేశంలో ఏఐ యాంకర్లు ఉన్న తొలి ప్రభుత్వ టీవీ చానల్​గా ఇది నిలువనున్నది. ఈ యాంకర్లు ఏఐ అనుసంధాన కంప్యూటర్లు. మనుషుల్లాగే పని చేస్తాయి. 365 రోజులు 24 గంటలు నిరంతరాయంగా వార్తలు చదువుతాయి.  

అన్ని రాష్ట్రాల రైతులు వీటిని వీక్షించొచ్చు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిశోధనల దగ్గర నుంచి మార్కెట్లలో ధరలు, వాతావరణ అంశాలు, 
ప్రభుత్వ పథకాలు సహా ప్రతి సమాచారాన్ని అందజేస్తాయి. ఇవి ఏకంగా 50 భాషల్లో మాట్లాడగలవు.