ఫ్రీ లాంచ్ పేరుతో కోట్లు వసూలు చేసిన గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్

 ఫ్రీ లాంచ్ పేరుతో  కోట్లు వసూలు చేసిన గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్

హైదరాబాద్ లో సాహితీ ఇన్ఫ్రా తరహాలోనే మరో రియల్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఫ్రీ లాంచ్ పేరుతో  కోట్ల రూపాయలను వసూలు చేసింది గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ కన్ స్ట్రక్షన్ కంపెనీ. రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసిందని బాధితులు సీసీఎస్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని  న్యాయం చేయాలని కోరుతున్నారు. గత బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందండలతో గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ సంస్థ రెచ్చిపోయిందని బాధితులు ఆరోపిస్తు్న్నారు.