Navdeep: రేవ్ పార్టీపై స్పందించిన నవదీప్..మంచే జరిగింది..ఈ ఒక్కసారి నన్ను వదిలేశారు

Navdeep: రేవ్ పార్టీపై స్పందించిన నవదీప్..మంచే జరిగింది..ఈ ఒక్కసారి నన్ను వదిలేశారు

టాలీవుడ్ యాక్టర్ నవదీప్(Navdeep)ప్రెజెంట్ ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ మౌళి(Love Mouli). దర్శకుడు అవనీంద్ర(Avaneedra) తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస ప్రమోషన్స్, షోస్ లో పాల్గొంటున్నాడు నవదీప్.

అయితే, ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నవదీప్ కు ఇటీవల హాట్‌టాపిక్‌గా నిలిచిన బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అంతేకాదండోయ్..నవదీప్ సమాధానాలు కూడా ఇంట్రెస్ట్ కలిగించేలా ఇచ్చారు.  

వివరాల్లోకి వెళితే..

ఇటీవల హాట్‌టాపిక్‌గా నిలిచిన బెంగళూరు రేవ్‌ పార్టీకి తాను వెళ్లినట్టు రూమర్స్‌ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని భావిస్తున్నట్టు హీరో నవదీప్‌ (Navdeep) చెప్పారు. ‘ఏంటన్నా. ఈసారి మీ పేరు ఫేక్‌ న్యూస్‌లో కనిపించడంలేదు’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపారు. 

అలాగే,నవదీప్ హీరోగా నటితున్న లేటెస్ట్ ‘లవ్‌ మౌళి’ (Love Mouli) మూవీ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించి ప్రశ్న ఎదురవగా ఆయన స్పందించారు 'ఈ సారి మీ పేరు ఎందుకు బయటకు రాలేదు కదా..ఎందుకంటే ‘చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే..ఫస్ట్ మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు’ అంటూ ఓ జర్నలిస్టు ప్రశ్నించాడు.

" మంచే జరిగిందని, ఈ ఒక్కసారి నన్ను వదిలేశారని నవ్వుతూ సమాధానాలిచ్చారు. అలాగే, మరో విలేఖరి మాట్లాడుతూ..'రేవ్‌ పార్టీ అంటే..రేయి, పగలు జరిగేదని' ఓ ప్రశ్నకు సమాధానంగా..నవదీప్ బదులిస్తూ..'ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు.

లవ్ మౌళి సినిమా విషయానికొస్తే..

లవ్‌ మౌళి సినిమా..లాక్ డౌన్ లోనే మొదలై.. రెండేళ్ల తర్వాత వస్తుండటంతో హైప్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాకూండా నవదీప్‌ 2.O గా వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణం ఎలా జరిగిందన్న దానిపై ఓ సినిమా తీయొచ్చు..చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం’’ అని తెలిపారు.

రొమాంటిక్‌ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన ‘లవ్‌ మౌళి’లో భావన సాగి హీరోయిన్‌. ఈ మూవీ జూన్‌ 7న రిలీజ్ కానుందని వెల్లడించారు. చాలా రోజుల తర్వాత నవదీప్ లో కొత్త యాంగిల్ తో వస్తోన్న ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.