ఇంట‌ర్న‌ల్ మార్కుల ఆధారంగా CBSE విద్యార్థుల ప్ర‌మోష‌న్

ఇంట‌ర్న‌ల్ మార్కుల ఆధారంగా CBSE విద్యార్థుల ప్ర‌మోష‌న్

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కార‌ణంగా సీబీఎస్ఈ విద్యార్థుల ప‌రీక్ష‌ల విష‌యంలో బోర్డుకు కేంద్రం కీల‌క సూచ‌న‌లు చేసింది. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థులకు ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి.. అంద‌రినీ పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేయాల‌ని సీబీఎస్ఈ (సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్)ని కోరిన‌ట్లు తెలిపారు కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ర‌మేశ్ నిశికాంత్.


అలాగే తొమ్మిది, ప‌ద‌కొండు త‌ర‌గ‌తుల విద్యార్థుల‌ను వారి ఇంట‌ర్న‌ల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా ఆయా స్కూల్స్ వారిని నెక్ట్స క్లాస్ కు ప్ర‌మోట్ చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు కేంద్ర మంత్రి. ఇందుకోసం ప్రాజెక్ట్ వ‌ర్క్స్, పీరియాడిక్ టెస్టులు, ట‌ర్మ్ ఎగ్జామ్స్ వంటివి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఇంటర్న‌ల్ అసెస్మెంట్ ఆధారంగా పాస్ కాని విధ్యార్థులు ఆయా స్కూళ్ల‌లో కండ‌క్ట్ చేసే ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ప‌రీక్ష‌ల‌ను రాయాల్సి ఉంటుంద‌ని ర‌మేశ్ నిశికాంత్ చెప్పారు. ఈ క‌రోనా లాక్ డౌన్ సంద‌ర్భంగా విద్యార్థులంతా సుర‌క్షితంగా ఇంటి ద‌గ్గ‌రే ఉంటూ బాగా చ‌దువుకోవాల‌ని చెప్పారాయ‌న‌.