బస్టాండ్లలో రద్దీ పర్యవేక్షణకు 36 సీసీ కెమెరాలు

బస్టాండ్లలో రద్దీ పర్యవేక్షణకు 36 సీసీ కెమెరాలు
  • ప్రయాణికుల కోసం షామియానాలు
  • ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్

హైదరాబాద్: ‘సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి అసౌకర్యం కలగకుండా టీఎస్సార్టీసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ లోని ప్రధానంగా రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సుదుపాయం కల్పించింది.

ప్రధాన ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లైన ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ లలో కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని బస్‌ భవన్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కు అనుసంధానం చేసింది. ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు  అందుబాటులో ఉంచుతున్నారు.’ అని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.