ఆర్టీసీపై హైకోర్టులో సీసీఎస్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌

ఆర్టీసీపై హైకోర్టులో సీసీఎస్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: క్రిడెట్ కో ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్‌‌‌‌‌‌‌‌)కు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఆర్టీసీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై సీసీఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌లో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆర్టీసీ ఫైనాన్షియల్ అడ్వైజర్(ఎఫ్‌‌‌‌‌‌‌‌ఏ) పుష్పకుమారిని ప్రతివాదులుగా సీసీఎస్ చేర్చింది.

కార్మికుల జీతాల నుంచి కట్ చేసి సీసీఎస్‌‌‌‌‌‌‌‌కు చెల్లించాల్సిన అసలు, వడ్డీ కలిపి రూ.900 కోట్లు ఆర్టీసీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు బకాయి ఉండటంతో వేలాది మంది ఆర్టీసీ కార్మికులకు సీసీఎస్ లోన్లు ఇవ్వలేకపోతోంది. మొత్తం 6,500 లోన్ అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని పిటిషన్‌‌‌‌‌‌‌‌లో సీసీఎస్ పేర్కొంది. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌ ఈ నెల 14న లేదా 15 న విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.