ఎమ్మెల్సీ ఎన్నికలకు రెడీనా?

ఎమ్మెల్సీ ఎన్నికలకు రెడీనా?
  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రెడీనా?
  • రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోరిన సీఈసీ

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎమ్మెల్యే కోటాలో మండలికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆరుగురు సభ్యుల పదవీ కాలం జూన్ 3తో ముగిసింది. కరోనా సెకండ్ వేవ్ కారణంతో అప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని సర్కార్‌కు సీఈసీ చెప్పింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎన్నికలకు రాష్ట్ర సర్కారు ఓకే చెప్తే కేంద్రం వెంటనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని, ఈ వారంలోనే కేంద్రానికి సమాధానం పంపనున్నట్టు తెలిసింది. దీంతో ఆగస్టులోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలతో పాటే హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. బైపోల్ నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి తెప్పించుకున్న కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే బైపోల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.