ఓయూలో కాంగ్రెస్ వంద రోజుల పాలన వేడుకలు

ఓయూలో కాంగ్రెస్ వంద రోజుల పాలన వేడుకలు
  •      ఆర్ట్స్​కాలేజీ వద్ద  బెలూన్లు ఎగుర వేసి విద్యార్థుల డ్యాన్సులు 

ఓయూ,వెలుగు​: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగ కల్పన దిశగా ముందుకు సాగుతుందని రాష్ర్ట గ్రంథాలయాల చైర్మన్​రియాజ్​ పేర్కొన్నారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  వంద రోజులు పూర్తయినందున ఆదివారం ఓయూలో భారీగా సంబరాలు నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్​ఆధ్వర్యంలో ఆర్ట్స్​కాలేజీ వద్ద ర్యాలీ నిర్వహించిన అనంతరం గాలిలోకి 100 బెలూన్లు ఎగురవేశారు. అనంతరం పటాకులు పేల్చి, ప్రజా పాలన సక్సెస్ అయిన సందర్భంగా విద్యార్థులు డ్యాన్సులు చేశారు.

 కాంగ్రెస్​ప్రభుత్వాన్ని పొగుడుతూ నినాదాలు చేశారు. వేయి మంది విద్యార్థులకు పోటీపరీక్షల మెటీరియల్​ను  పంపిణీ చేశారు.  రియాజ్ మాట్లాడుతూ రాష్ర్ట గ్రంథాలయాల చైర్మన్​రియాజ్​ మాట్లాడుతూ..100 రోజుల పాలనలోనే 34 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన  ఘనత సీఎం రేవంత్​రెడ్డిది అన్నారు.  లోక్​సభ ఎన్నికల్లో  కాంగ్రెస్​ను గెలిపించి బీఆర్ఎస్​, బీజేపీలకు బుద్ధి చెప్పాలని యువతను కోరారు. చనగాని దయాకర్​తో పాటు టీపీసీసీ ప్రతినిధి బాలలక్ష్మి, ఎన్​ఎస్​యూ నేతలు మేడ శ్రీను, సుమన్ గౌడ్ , నవీన్, వినోద్, మహేశ్​పాల్గొన్నారు.