న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి చాలా వైవిధ్యం. దీన్ని అందరూ నమ్మే తీరాల్సిందే. మహమ్మారి విజృంభిస్తున్న ఈ టైమ్‌లో కూడా ఇంటర్నెట్‌లో మీమ్స్, జోక్స్ వైరల్ అవుతుండటాన్ని గమనించొచ్చు. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా సరదా వాతావరణాన్ని క్రియేట్ చేస్తుండటానికి యత్నిస్తున్నారు. రీసెంట్‌గా 2020 చాలెంజ్ పేరుతో ఓ కొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. కరోనా కారణంగా గడిచిన కొన్ని నెలల జీవితం గురించి ఈ చాలెంజ్‌లో ఫొటోలు చెబుతున్నాయి. వచ్చే సెప్టెంబర్ నెల ఎంత భీకరంగా ఉండబోతోందోననే విషయాన్ని కూడా ఈ చాలెంజ్ సూచిస్తోంది.
ఈ ట్రెండ్‌ను అమెరికా యాక్టర్, ప్రొడ్యూసర్ రీస్ వితర్‌స్పూన్ ఫాలో అవడంతో బాగా పాపులర్ అయింది. ఆమె దిగిన కొన్ని రకాల హావభావాలతో ఉన్న ఫొటోలను నెలల వారీగా చేరుస్తూ రీస్ పోస్ట్ చేసింది. ప్రతి నెలకు అప్పటికి తగ్గ మూడ్‌తో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అవును 2020 అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలను రీస్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఆమె పోస్ట్ షేర్ చేసిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు ఫొటోల్లోని ఆమె మూడ్‌ను మెచ్చుకుంటూ కామెంట్‌లు చేశారు. మైండీకేలింగ్, కెర్రీ వాషింగ్టన్ లాంటి నటీమణులు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఫొటోలను పోస్ట్ చేశారు.
