
న్యూఢిల్లీ: దేశం మొత్తం మీద సిమెంట్ ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. నెల వారి ప్రాతిపదికన చూస్తే జూన్‌లో 50 కేజీల సిమెంట్ బస్తా ధర సగటున 4 శాతం పెరిగి రూ. 376 కు చేరుకుంది. సౌత్ ఇండియాలో అయితే సిమెంట్ 50 కేజిల సిమెంట్ బస్తా ధర 11 శాతం పెరిగి సగటున రూ. 415 లను టచ్ చేసిందని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. పెంటప్ డిమాండ్(ఒక్కసారిగా డిమాండ్ క్రియేట్ అవ్వడం) ఉండడం వలన ధరలు పెరుగుతున్నాయని సిమెంట్ డీలర్లు చెబుతున్నారని తెలిపింది. డిమాండ్‌కు తోడు, రామెటీరియల్స్ ధరలు కూడా పెరుగుతుండడంతో కంపెనీలు ఈ కాస్ట్‌ను కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి. పెట్రోలియం కోక్ (పెట్ కోక్), కోల్ వంటి కీలక రామెటీరియల్స్ ధరలు గత కొన్ని నెలల నుంచి పెరుగుతున్నాయి.