
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ హిందీ మూవీ 'ఓ మై గాడ్2'. ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ కీ రోల్స్ చేస్తున్నారు. 2012లో వచ్చిన ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్నా 'ఓ మై గాడ్ 2' మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈ సినిమాను ఇటీవల సెన్సార్ కు పంపించారు మేకర్స్.
సెన్సార్ బోర్డు ఓ మై గాడ్2 సినిమాకు A సర్టిఫికెట్ ను జారీ చేసి.. సినిమాలో మొత్తం 27 మార్పులను సూచించిందట. అంతేకాదు సినిమా నుండి సెన్సార్ రూల్స్ కు విరుద్ధంగా ఉన్న 13.51 నిమిషాలు సీన్స్ డిలీట్ చేసి... వాటి స్థానంలో కొత్తగా 14.01 నిమిషాలు ఫుటేజ్ ను యాడ్ చేశారట. ఇవన్నీ చూస్తుంటే మొదటి పార్ట్ లాగే ఈ సినిమా కూడా వివాదాలకు కేరాఫ్ గా మారనిందనే అనుమానం కలగక మానదు. మరి రిలీజ్ తరువాత ఈ సినిమా కు ఎలాంటి రిజల్ట్ వస్తుంది? ఎన్ని వివాదాలు రానున్నాయి అనే విషయం తేలియాలంటే ఆగస్టు 11 వరకు ఆగాల్సిందే.