
దేశంలోని జనాభా లెక్కల కోసం కేంద్రం బడ్జెట్లో రూ.1,309.46 కోట్లు మాత్రమే కేటాయించింది. 2021లోనే దేశ జనాభాను లెక్కించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత ప్రాసెస్ ముందర పడలేదు. దేశ జానాభా లెక్కలు తీసేందుకు రూ.12వేల కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కేంద్రం నామమాత్రంగా కేటాయింపులు చేయడంపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.