వ్యాక్సిన్ల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష

వ్యాక్సిన్ల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష
  • రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ల కేటాయింపు విషయంలో తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపపుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు.  గుజరాత్ తో పోలిస్తే తెలంగాణకుకేటాయించినదెంతో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదన్నారు. బ్లాక్ లో ఆక్సిజన్ సరఫరా చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్సిజన్ ఉత్పత్తి, అందుబాటులో ఉన్న నిల్వలు, సరఫరాలపై ఐ ఏ ఎస్ అధికారుల బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని మంత్రి ఈటెల వెల్లడించారు. తమిళనాడు తరహాలో మా ఆక్సిజన్ మేమే వాడుకుంటాం అని అనొచ్చు., కానీ అందరి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అలా  చేయడం లేదని మంత్రి ఈటెల స్పష్టం చేశారు.